![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -226 లొ....అప్పు నిద్ర నుండి లేచి వచ్చి కాఫీ అడుగుతుంది. అన్నపూర్ణ కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటి నువ్వు తెచ్చావ్ అమ్మ ఎక్కడ అని అప్పు అడుగుతుండగా.. అప్పుడే కనకం కృష్ణమూర్తి ఇద్దరు వస్తారు. ఎక్కడికి వెళ్లారని అప్పు అడిగిన.. కావ్య దగ్గరకి వెళ్లిన విషయం కనకం చెప్పదు.
మరొక వైపు కావ్య గదిలోకి వస్తుంది. కాసేపటికి రాజ్ వస్తాడు. నువ్వు నిజంగా మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళావా అని రాజ్ అడుగుతాడు. అంటే మీకు ఇంకా నమ్మకం రాలేదా అని కావ్య అంటుంది. ఏదయినా చెప్పి చేసే నువ్వు.. చెప్పకుండా వెళ్లినందుకు డౌట్ వచ్చిందని రాజ్ అంటాడు. కావ్య కావాలనే రాజ్ ని ఆటపట్టిస్తుంది. మళ్ళీ వెళ్తున్న అంటూ బట్టలు సర్దినట్లుగా చేసేసరికి.. రాజ్ నిజంగానే అనుకొని వద్దు, ఎక్కడికి వెళ్లకంటు రిక్వెస్ట్ చేస్తాడు. మరొకవైపు స్వప్న వాటర్ తాగుతుంటుంది. ఇందిరాదేవి స్వప్న కడుపు వంక చూస్తూ రుద్రాణి నీ కోడలు గురించి అలోచించావా అని రుద్రాణిని ఇందిరాదేవి అడుగుతుంది. దేని గురించి అడుగుతున్నారని రుద్రాణి తెలియనట్టు అడుగుతుంది. స్వప్న కీ నాలుగు నెలలు పూర్తి అయ్యి అయిదు నెలలు వస్తుంది కదా శ్రీమంతం గురించి అని ఇందిరాదేవి అనగానే.. అలాంటివేం వద్దు. స్వప్న రాహుల్ ఇద్దరు ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నారో అందరికి తెలుసు కదా, పైగా స్వప్న పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ ఇప్పుడు శ్రీమంతం చేస్తే పరువు పోతుందని రుద్రాణి అంటుంది. ప్రతి ఆడపిల్లకి ఆ కోరిక ఉంటుంది కదా అని ఇందిరాదేవి అంటుంది. మరొక వైపు స్వప్న కడుపు ఎలాగైనా పోగొట్టుకోవాలని అనుకుంటుంది.
మరొక వైపు అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేసి కలవాలని చెప్తాడు. దానికి అప్పు.. నేను రానని కోపంగా చెప్తుంది. మరొక వైపు రాజ్ తనని ప్రేమిస్తున్నట్లు నటించాడు అనే కోపంతో రాజ్ ని ఆటపట్టిసస్తుంది కావ్య. ఆ తర్వాత స్వప్న మెట్లపై నుండి పడిపోయి ప్రెగ్నెంట్ పోయిందని చెప్పొచ్చు అనుకొని మెట్లపై నుండి పడిపోతుంది. అప్పుడే కావ్య వచ్చి స్వప్నని పట్టుకుంటుంది. అందరు అంత అజాగ్రత్తగా ఉన్నావా అంటు స్వప్నని తిడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |